సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బడుగుల లింగయ్య యాదవ్

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బడుగుల లింగయ్య యాదవ్
  • మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

సూర్యాపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జగదీశ్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్  డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం  మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తప్పుడు హామీలతో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులను మోసం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్న నాయకులపై నిరాధారమైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.  

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్‌‌‌‌ప‌‌‌‌ర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, తదితరులున్నారు.