మల్లారెడ్డి ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 లక్షలు తీస్కోడు: బీఆర్ఎస్ నేతలు

మల్లారెడ్డి ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 లక్షలు తీస్కోడు: బీఆర్ఎస్ నేతలు

మంత్రి మల్లారెడ్డిపై కీసర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని..ఆయన చేసిన సేవలు కనిపిస్తలేవా ? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతపై తాము పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీలో అవినీతి జరిగితే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కీసర ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కీసర మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కీసర గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలపై బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.

ప్రతి గ్రామ పంచాయతీ నుండి పది లక్షల రూపాయలు మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేశాడు. బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలు సరికావని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ధర్నా అనంతరం కీసర పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లరపు ఇందిరా, స్థానిక సర్పంచ్ మాధురి వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు భాను ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.