అప్పులపై స్పీకర్ అబద్ధాలు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

అప్పులపై స్పీకర్ అబద్ధాలు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అప్పులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.3,50,520 కోట్లు అని పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుచేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహవాస దోషంతో చెడిపోయి రేవంత్ రెడ్డి లైన్​లో నడుస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ పైస్థాయికి వెళ్లాలని, రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపి గడ్డం ప్రసాద్‌‌ సీఎం కావాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

కోదండరాంపై రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. సీఎం పదవికి కోదండరాం అర్హుడన్నారు. కోదండరాంపై సీఎంకు అంత ప్రేమే ఉంటే వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోదండరాంను నిలబెట్టి గెలిపించుకోవాలన్నారు. బీజేపీ కుట్రపూరితంగా తాము ఎమ్మెల్సీలు కాకుండా చేస్తే మాట్లాడాల్సింది కోదండరామ్ కాదా? అని ప్రశ్నించారు.