- మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రమణ హాట్ కామెంట్
జగిత్యాల, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తపై ఈగ వాలినా చేయి నరుకుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇటీవల మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగిత్యాల బీఆర్ఎస్ ఆఫీస్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభ సన్నాహక సమావేశం బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ.. కేసీఆర్ పిలుపుతో నిస్వార్థంగా పార్టీలో చేరి ఎమ్మెల్సీగా కరీంనగర్ జిల్లా అంతటా తిరిగి పని చేస్తున్నానని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేసీఆర్ అడ్డా అని, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచే అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. మళ్లీ కరీంనగర్ నుంచే ప్రభుత్వ ఏర్పాటుకు పునాదులు వేస్తామని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత పాల్గొన్నారు.

