మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కేటీఆర్

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కేటీఆర్
  • ఉమ్మడి జిల్లా నేతలకు కేటీఆర్ సూచన

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్​ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ఉమ్మడి జిల్లా శ్రేణులకు సూచించారు. శనివారం హైదరాబాద్​లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన లీడర్లతో కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్​రావు భేటి అయ్యారు.

ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్​, మున్సిపాలిటీల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు. రాజ్యసభ ఎంపీ సురేశ్​రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్,   హన్మంతుషిండే, జాజాల సురేందర్, బిగాల గణేశ్​గుప్తా,  షకీల్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్,  పార్టీ జిల్లాల ప్రెసిడెంట్లు ఎం.కె.ముజిబొద్దీన్,  ఆశన్నగారి జీవన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.