రోజుకో కొత్త ఆఫర్స్, డేటా ప్లాన్స్ తో టెలికాం కంపెనీలు కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే పెద్ద టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ పలు ప్లాన్ లను ప్రకటించి ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తక్కువ డబ్బుతో బంఫర్ ప్రయోజనాలను ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
దేశంలోనే పెద్ద టెలికాం కంపెనీలో ఒకటైన BSNL.. ప్లాన్ ధరను రూ. 1515 గా నిర్ణయించింది. దీని ద్వారా సౌకర్యాలు కూడా పొందే వెసులుబాటును కూడా కల్పించింది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, లాంగ్ వాలిడిటీ, బంపర్ డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 GB డేటా, ఒక సంవత్సరం అంటే 365 రోజుల వరకు చెల్లుబాటును పొందుతారు. ఇది కాకుండా ప్రతిరోజూ 100 SMSలను ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా మీ డేటా అయిపోయినా, ఇంటర్నెట్ 40Kbps వేగంతో కొనసాగుతుంది. ఈ ప్లాన్ లో నెల చొప్పున లెక్క వేస్తే రూ.126 వస్తుంది.
ఈ ప్లాన్ కూడా సందడి చేస్తోంది
BSNL అనేక బోల్డ్ ప్లాన్‌లతోనూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 397 రీఛార్జీతో 6 నెలల పాటు రోజుకు 2 జీబీ బంపర్ డేటా కూడా అందిస్తోంది.
