టీఎస్పీఎస్పీ బోర్డును ప్రక్షాళన చేయాలి : మోహన్,శ్రీకాంత్

టీఎస్పీఎస్పీ బోర్డును ప్రక్షాళన చేయాలి : మోహన్,శ్రీకాంత్

సిద్దిపేట రూరల్, వెలుగు: టీఎస్పీఎస్పీ  బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మోహన్, పీడీఎస్​యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ప్రజాఫ్రంట్ నాయకుడు సత్తయ్య డిమాండ్​ చేశారు. శనివారం సడక్ బంద్ లో భాగంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రవల్లిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు.  కార్యక్రమంలో యాదగిరి, ఉమేశ్​, విద్యానాథ్, అశోక్, బాబు, వెంకటేశ్వర్లు, మల్లేశం, భాను పాల్గొన్నారు.