జీవో 317 అమలు నిలిపేయాలి

జీవో 317 అమలు నిలిపేయాలి

తమ చేతులనే ఉలిగా మార్చి మహానగరాలను సృష్టించిన వడ్డెరలను ధ్వంసం చేయడంలో నాజీలను మించిపోయిండ్రు మన టీఆర్ఎస్ పాలకులు అంటూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొన్ని రోజుల క్రితం గౌలిదొడ్డి (రంగారెడ్డి జిల్లా) బసవతారకనగర్ బస్తీలో వడ్డెరలపై కేసీఆర్ ప్రభుత్వపు విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేను.ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం” అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిన్న రాత్రి గౌలిదొడ్డికి వెళ్లి అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉండి, పోరాడతామని హామీ ఇచ్చారు.

‘‘బహుజన మిత్రులారా, మనం గళం ఎత్తకపోతే మనందరిని ఈ BC వడ్డెర బిడ్డల లాగానే, రోహింగ్యాల కన్నా ఘోరంగా, రోడ్డు పాలు చేసి మన ఆస్తులను ధ్వంసం చేసి ఆ శిధిలాల పై తన విలాసవంతమైన ఆకాశహర్మ్యాలను సృష్టించి రోజూ విందులు విలాసాల్లో మునిగితేలుతది ఈ ప్రభుత్వం” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

జీవో 317 అమలు నిలిపేయాలి

జీవో 317ను అమలును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. క్యాడర్ అలాట్మెంట్‌లో లొసుగులు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ చానల్స్ పై  ఫోకస్ పెట్టాలని ట్వీట్ చేశారు. 317ను కేవలం సీనియార్టి ప్రాతిపాదికన 317ను నిరంకుశంగా అమలు చేస్తున్నందుకే మహబూబాబాద్ లో ప్రధానోపాధ్యుడు జేత్రం చనిపోయాడని చెప్పారు.