బహుజనుల రాజ్యం వస్తేనే బతుకులు బాగుపడుతయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజనుల రాజ్యం వస్తేనే బతుకులు బాగుపడుతయ్  : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే బతుకులు బాగుపడుతాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ నుంచి రెండో విడత రాజ్యాధికార యాత్ర ప్రారంభమైంది. అన్నీ గ్రామాల్లో కేవలం బహుజనుల జెండాలకు మాత్రమే కొందరు అభ్యంతరం చెప్తున్నారని ఆరోపించారు. బహుజనులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ తెలుసుకోవాలని..  యువత చదువుకొని రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. బహుజనుల పిల్లలు కూడా విమానం ఎక్కి విదేశాల్లో చదువుకోవాలని ఆకాంక్షించారు.