ట్రాన్స్ కో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ట్రాన్స్ కో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : ప్రమోషన్స్ లో తెలంగాణ ట్రాన్స్ కో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ట్రాన్స్ కో యజమాన్యం దాదాపు 1300 మంది ఉద్యోగులను 7 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టి..వాళ్ల ప్రమోషన్స్ ను రద్దు చేయడం తగదన్నారు. ట్రాన్స్ కో ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, వాళ్ల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ట్వీట్ చేశారు. 

ఏపీ ఉద్యోగుల కోసం తెలంగాణ ట్రాన్స్ కో ఉద్యోగులను రోడ్డు మీద పడేసే కుట్ర జరుగుతోందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ లో ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తమ పార్టీ అండగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు ప్రమోషన్స్ ను రద్దు చేస్తే ఊరుకునేది లేదన్నారు.