
- పర్యటనను రద్దు చేసుకున్న యూఎస్ బృందం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద (బీటీఏ) చర్చల్లో పాల్గొనేందుకు ఈ నెల 25 న ఇండియాకు రావాల్సిన అమెరికా ప్రతినిధుల బృందం, తమ పర్యాటనను రద్దు చేసుకుంది. ఆగస్టు 25–30 మధ్య ఆరో విడత బీటీఏ చర్చలు రద్దయ్యాయని ఒక సీనియర్ అధికారి శనివారం ధృవీకరించారు. దీంతో సమీప భవిష్యత్తులో ఇండియాకు టారిఫ్ రిలీఫ్ ఉంటుందనే అంచనాలు తగ్గిపోయాయి.
“అమెరికా వైపు నుంచి చర్చలు నిలిపివేశారు. ఇది శాశ్వతమా? తాత్కాలికమా? అనే స్పష్టత లేదు. ఆగస్టు 25 సమావేశానికి రాబోమని చెప్పారు” అని అధికారి తెలిపారు. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు టారిఫ్‌ను 50శాతానికి పెంచిన తర్వాత, బీటీఏ చర్చలపై అందరు ఫోకస్ పెట్టారు. ఈ చర్చల్లో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు ఉంటాయని అంచనా వేశారు.