
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ బీయూ4 వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వంద స్టోర్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన ఈ కంపెనీ హైదరాబాద్‌లో గురువారం ప్రత్యేక ఔట్లెట్ ప్రారంభించింది. దీనిని ఎంవీ ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీయూ4 ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చైర్మన్ ఊర్విష్ షా మాట్లాడుతూ నెలకు ఐదు వేల యూనిట్లను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు.
దక్షిణాదిలో వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఔట్లెట్లను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. త్వరలో యూరాన్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని షా చెప్పారు. తాము లో-స్పీడ్ శ్రేణిలో స్టార్, షైన్, డోడో అనే మూడు మోడల్స్‌ను, హై-స్పీడ్ శ్రేణిలో పీయోనీక్స్ అనే మోడల్‌ను అమ్ముతున్నామని చెప్పారు. ధరలు రూ.75 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు ఉన్నాయని షా వివరించారు.