భార్యా బిడ్డలతో ఊరొదిలి పారిపోండి.. బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

భార్యా బిడ్డలతో ఊరొదిలి పారిపోండి.. బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికల ఫలితాల రోజు నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కొనసాగుతూనే ఉంది. విజయోత్సాహంతో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎవడు వచ్చినా రాళ్లతో కొడతామని, భార్య బిడ్డలతో ఊర్లు వదిలి పారిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క సీఎం చంద్రబాబు ప్రతీకార చర్యలకు పాల్పడకుండా పాలనపై దృష్టి పెట్టాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఉర్లోదిలి పారిపోవడానికి తాము ఇప్పటికే టైం ఇచ్చామని, అది అయిపోయిందని అన్నారు. చంద్రబాబును ఎవడు విమర్శించినా చూస్తూ ఊరుకోమని అన్నారు. ఓపెన్ గా చెప్తున్నానని, ఇది రాజధాని ప్రాంతం, విజయవాడకు రాకుండా ఎవడు ఉండడని, చంద్రబాబుపై పిచ్చి వాగుడు వాగిన వాళ్ళని ఎవ్వరినీ వదిలిపెట్టమని అన్నారు.వైసీపీ నాయకులు కోడలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు బుద్ధా.