బేసిక్ ట్యాక్స్ మినహాయింపు రూ.5 లక్షలకు పెరుగుతదా?

బేసిక్ ట్యాక్స్ మినహాయింపు రూ.5 లక్షలకు పెరుగుతదా?

న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటిన (గురువారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్యాక్స్ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వొచ్చని, టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత  సులభతరం చేయొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.

1.  కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం బేసిక్ ట్యాక్స్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతుందని  అంచనా.  అంతేకాకుండా ట్యాక్స్ రేట్లను తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్యాక్స్ డిడక్షన్లు, మినహాయింపులు లేవు కాబట్టి స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల  నుంచి రూ. లక్షకు ప్రభుత్వం పెంచే అవకాశం  ఉంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిడక్షన్ పెంచి  ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వొచ్చు. ఉద్యోగాలు చేసుకునేవారు  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పాత ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీటిని ట్యాక్స్ మినహాయింపుగా వాడుకోవడానికి వీలుంది. కొత్త సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సౌకర్యం లేదు. అందువలన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం పొదుపు చేసుకోవడానికి, ప్రజలను ఎంకరేజ్ చేయడానికి కొత్త సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని   ట్యాక్స్ శ్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రేషనలైజ్ చేసే అవకాశం ఉంది.

2. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కు సంబంధించి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ చట్టం,1961 లో 30 కి పైగా సెక్షన్లు ఉన్నాయి.  0.1 శాతం నుంచి 30 శాతం వరకు అనేక శ్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రేట్లు ఉన్నాయి. దీంతో టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడం, లెక్కించడం సంక్లిష్టంగా మారింది. టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత సులభంగా మార్చాలని  ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉదాహరణకు,  టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  వేసే ఫీజులు, ప్రొఫెషనల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మధ్య తేడాను క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వివరించాలని అడుగుతున్నాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై అయితే 2 శాతం టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, అదే ప్రొఫెషనల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అయితే 10 శాతం టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేస్తున్నారు.

3.  లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేసే ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రభుత్వం  టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  3 నెలలకు తగ్గించింది.  కానీ, విదేశాల్లో సంపాదిస్తున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియాలో కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉన్నవాళ్లు ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపు రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఫైల్ చేయలేకపోతున్నారు. డిసెంబర్  31 లోపు (రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చివరి తేది) వీరికి విదేశాల్లోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు అందకపోవచ్చు. ఇలాంటి వారి కోసం టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చాలని లేదా తగిన రూల్స్ తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు.

4. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు  సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 80ఈఈబీ కింద  లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్డీపై మినహాయింపును ప్రభుత్వం ఇచ్చింది. అంటే  1 జనవరి 2019 నుంచి 31 మార్చి 2023 మధ్య ఎలక్ట్రిక్ వెహికల్  లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రూవ్ అయితే  ఈ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చెల్లించే వడ్డీ రూ.1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద వాడుకోవచ్చు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పెంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 5.  లిస్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ లిస్టెడ్ సెక్యూరిటీల సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేస్తున్న లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా షార్ట్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని నిపుణులు కోరుతున్నారు.