ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయండి!

ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయండి!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు:ఇన్వెస్టింగ్ వరల్డ్‌‌‌‌‌‌‌‌లో వారెన్ బఫెట్ అంటే తెలియని వారుండరు. 1965  నుంచి బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ హాత్​వేకి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న బఫెట్‌‌‌‌‌‌‌‌,  షేరుహోల్డర్లకు రాసే యాన్యువల్ లెటర్స్‌‌‌‌‌‌‌‌లో తన విలువైన సలహాలను జోడిస్తుంటారు. ఈ సారి కూడా యువతకు తనదైన శైలిలో మంచి సలహాలను ఇచ్చారు. ఒక సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే సలహా అంటే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఎలా డబుల్ చేసుకోవడమో  మాత్రమే అయి ఉంటుందని అనుకుంటే తప్పే!  సంతృప్తి ఇచ్చే జాబ్‌‌‌‌‌‌‌‌ను వెతుక్కోవాలని బఫెట్‌‌‌‌‌‌‌‌ యువతకు సలహాయిచ్చారు. డబ్బు  వెంట పడొద్దని సూచించారు.  ‘లాభం కంటే  వ్యక్తిగత సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి’ ..తాజాగా యాన్యువల్ లెటర్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా బఫెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సలహా ఇది.

డబ్బు పెద్దగా ముఖ్యం కాకపోతే , తాము ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేయగలిగే జాబ్‌‌‌‌‌‌‌‌నే ఎంచుకోవాలని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఆయన సలహాయిచ్చారు. ‘డబ్బు ముఖ్యం కాదనుకుంటే, ఎలాంటి వారు తమ చుట్టూ ఉండాలనుకుంటున్నారో, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కోసం ప్రయత్నించండి’ అని ఈ సీనియర్ ఇన్వెస్టర్ పేర్కొన్నారు.  ‘ఇలాంటి జాబ్స్‌‌‌‌‌‌‌‌ను వెతకడంలో వాస్తవంగా ఉండే ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉంటాయని ఒప్పుకుంటా.  అయినప్పటికీ యువత ఇలాంటి జాబ్స్‌‌‌‌‌‌‌‌ కోసం వెతకడం ఆపొద్దు. ఒకసారి ఇలాంటి జాబ్స్ కనిపెడితే  వీరు తర్వాత ‘పనిచేయాల్సిన’ అవసరం ఉండదు’  అని తన లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పేర్కొన్నారు.

జీవితంలో నచ్చే పనిని వెతుకుతూనే..

తనకు నచ్చిన పనిని తాను ఎలా చేరుకోగలిగారో వారెన్ బఫెట్ వివరించారు. 1940 లో తన తాతగారి గ్రోసరీ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను, తన పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ హాతవే  వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చార్లీ మంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యామని గుర్తు చేసుకున్నారు. ఈ పార్ట్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ జాబ్‌‌‌‌‌‌‌‌లో  పని బోరింగ్‌‌‌‌‌‌‌‌గా ఉండేదని, తక్కువ జీతం అందేదని చెప్పుకొచ్చారు. మంగర్  లా లోకి వెళ్లినా, తాను సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినా జాబ్ శాటిస్​ఫాక్షన్​ దొరకలేదని అన్నారు. చివరికి బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాత్​వేలో  తమకు నచ్చినదానిని కనుక్కున్నామని చెప్పుకొచ్చారు. 1965 లో బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ హాత్​వేను వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్ కొనుగోలు చేశారు. అప్పుడు టెక్స్టింగ్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ,  వారెన్ కొనుగోలు చేశాక అతిపెద్ద ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీగా ఎదిగింది. ప్రస్తుతం బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యాపిల్‌‌‌‌‌‌‌‌, కోక–కోలా, అమెరికన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ వంటి టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయి.

ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయండి!

గతంలో  కూడా కాలేజ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు, యంగ్ ఇన్వెస్టర్లకు ఇలాంటి సలహాలనే బఫెట్ ఇచ్చారు. ‘ఇలా చేస్తే మనీ రెండింతలవుతుంది’ వంటి సలహాలు కాకుండా ఇన్వెస్టర్లు తమను తాము ముందు మార్చుకోవాలని ఆయన చెబుతుంటారు. ‘ప్రస్తుత స్థాయి కంటే  50 శాతం ఎక్కువ విలువైన వారిగా మారొచ్చు.  రాయడం, మాట్లాడడం పరంగా  కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ సిల్క్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకోవాలి’ అని గతంలో ఆయన యువతకు సలహాయిచ్చారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను డబుల్ చేసుకోవడంపై కూడా ఇన్వెస్టర్లకు ఆయన అనేక సలహాలిచ్చారు. కొత్త ఇన్వెస్టర్లు ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేయాలని ఆయన చెబుతుంటారు. ఇటువంటి ఫండ్స్ ద్వారా టాప్ షేర్లతో కూడిన ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో డబ్బులు పెట్టడానికి  ఇన్వెస్టర్లకు వీలుంటుంది. ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌లో తరచూ ఇన్వెస్ట్ చేయడం వలన  ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ను కూడా దాటి ఇన్వెస్టర్లు రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ పొందగలుగుతారని  వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్‌‌‌‌‌‌‌‌ చెబుతుంటారు.  వాల్యూ ఇన్వెస్టింగ్‌‌‌‌‌‌‌‌ తెలిస్తే ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌ షేర్లలో కూడా డబ్బులు పెట్టొచ్చు. వారెన్ బఫెట్ ఇలాంటి ఇన్వెస్టర్లకు ఇచ్చే సలహా ఏంటంటే..‘మీకు అర్థం కాని బిజినెస్‌‌‌‌‌‌‌‌లలో డబ్బులు పెట్టొద్దు. అది ఎంత గొప్ప బిజినెస్ అయినా’.