లింగంపేటలో చోరీ

లింగంపేటలో చోరీ
  •  5 తులాల బంగారం, రూ.20 వేల నగదు అపహరణ

లింగంపేట, వెలుగు: లింగంపేటలోని మత్తడి కింది పల్లె కాలనీలో నివాసముంటున్న పద్మనర్సింలు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఒకరోజు ఆలస్యంగా తెలిసింది. స్థానిక ఏఎస్ఐ రంగారావు తెలిపిన వివరాల ప్రకారం పద్మనర్సింలు శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాడు.

సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. బీరువాలో దాచిన 5 తులాల బంగారం,20 తులాల వెండితో పాటు రూ.20వేల నగదును దొంగిలించినట్లు గుర్తించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన ఇంటిని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, క్లూస్ ​టీమ్​సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రంగారావు తెలిపారు.