ట్యాలీ కొత్త వెర్షన్​ వచ్చేసింది

ట్యాలీ కొత్త వెర్షన్​ వచ్చేసింది

హైదరాబాద్​, వెలుగు: బిజినెస్​ మేనేజ్​మెంట్​ సాఫ్ట్​వేర్​ ప్రొవైడర్​ టాలీ సొల్యూషన్స్ ట్యాలీప్రైమ్​3.0ని లాంచ్​ చేసింది. జీఎస్టీ సొల్యూషన్, రిపోర్ట్​ సామర్థ్యం పెంపు,   బకాయిలను వేగంగా వసూలు చేయడంలో సహాయపడే  ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  ఎస్​ఎంఈలు తమ బిజినెస్​లను ట్యాలీ 3.0 ద్వారా మరింత సులువుగా నిర్వహించుకోవచ్చు. ఇది వాడటం సులువని, ఎస్​ఎంఈలకు తాము కొంత శిక్షణ కూడా ఇస్తామని సంస్థ జీఎం (సేల్స్​) భువన్ రంజన్​​ చెప్పారు.

‘‘డేటా భద్రత గురించి యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్యాలీ సాఫ్ట్​వేర్​ను హాక్​ చేయడం అసాధ్యం.  దీనికోసం ప్రొప్రైటరీ డేటాబేస్​ను వాడుతాం. లావాదేవీల హిస్టరీ యూజర్​కు తప్ప మాకు కూడా కనిపించవు. తెలంగాణ మొత్తం 1.5 లక్షల జీఎస్​టీఎన్​ రిజిస్టర్డ్​ ఎస్​ఎంఈలు ఉన్నాయి. మాకు ఈ రాష్ట్రంలో లక్ష మంది యూజర్లు ఉన్నారు. ఇక్కడ రాబోయే రెండేళ్లలో 50 శాతం సీఏజీఆర్​ సాధిస్తాం”అని అన్నారు.