తగ్గిన బ్యాంకు ట్రాన్స్​ఫర్లు

తగ్గిన బ్యాంకు ట్రాన్స్​ఫర్లు

న్యూఢిల్లీ:‘బయ్​ నౌ పే లేటర్​’ (బీఎన్​పీఎల్​)గా పిలిచే షార్ట్​టర్మ్​ లోన్ల సెగ్మెంట్​ఏటా దూసుకెళ్తూనే ఉంది. ఎక్కువ మంది కస్టమర్లకు ఇది ఫేవరేట్​ పేమెంట్​ సిస్టమ్​గా మారింది. కిందటి ఏడాది బీఎన్​పీఎల్​లోన్లు 637.27 శాతం పెరిగాయి. 2020లోనూ 569 శాతం గ్రోత్​ కనిపించింది. బీఎన్​పీఎల్​లోన్లు ఈజీగా, త్వరగా వస్తుండటమే ఈ  ​ గ్రోత్​కు​ కారణం. చాలా మంది ఇంటి అద్దె, రీచార్జ్​,ఇంటర్నెట్ బిల్​ వంటి రికరింగ్​ పేమెంట్లకూ బీఎన్​పీఎల్​వాడుతున్నారు. అందుకే ఈ సబ్​స్క్రిప్షన్​ ఎకానమీ గత ఏడాది 225.31 శాతం పెరిగింది. యూపీఐ పేమెంట్స్​ 63.02 శాతం, కార్డు పేమెంట్లు 25.92 శాతం పెరిగాయి. బ్యాంకు ట్రాన్స్​ఫర్లకు మాత్రం ఆదరణ తగ్గింది. వీటి సంఖ్య 51.77 శాతం పడింది. ఫైనాన్షియల్​ సొల్యూషన్స్​ కంపెనీ  రేజర్​పే.. ఎరా ఆఫ్​రైజింగ్​ఫిన్​టెక్​ (ఈఆర్​ఎఫ్) పేరుతో విడుదల చేసిన​ రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్​కు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఫోన్​కరెంటు బిల్లులకు సంబంధించిన లావాదేవీలు 2020, 2021లో వరుసగా 3,640 శాతం,   2,353 శాతం గ్రోత్​ సాధించాయి. లైఫ్​స్టైల్​,  ఫ్యాషన్  ఈ–-కామర్స్ లావాదేవీల నుంచి అత్యధిక రెవెన్యూ వచ్చింది.   కిరాణా సెగ్మెంట్​ 2021లో ఏకంగా 233 శాతం గ్రోత్​ను సాధించింది. ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సంబంధిత లావాదేవీలు 611శాతం పెరిగాయి. ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడమే ఇందుకు కారణం.  ఏరియాల వారీగా చూస్తే, డిజిటల్ లావాదేవీల్లో ఢిల్లీ కర్ణాటక కంటే ముందుంది, మొత్తం ఆన్‌‌‌‌లైన్ లావాదేవీలలో 18.69 శాతం వాటాను  దక్కించుకుంది.  2021లో  208.82 శాతం గ్రోత్​ సాధించింది. 

కాశ్మీర్​లోనూ పెరిగాయ్​

మొదటిసారిగా  గోవా  జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాలు కూడా దుమ్మురేపాయి. ఇవి 2021లో వరుసగా 162.54శాతం  161.44శాతం గ్రోత్​ రేటుతో డిజిటల్ లావాదేవీల్లో సత్తా చూపాయి. ఈ రాష్ట్రాలలో మళ్లీ పర్యాటకం పుంజుకున్న ఫలితంగా ఈ గ్రోత్​ సాధ్యమై ఉండవచ్చని రేజర్​పే పేర్కొంది. టైర్-2,  టైర్-3 సిటీల్లో 2020 నుండి 2021 వరకు డిజిటల్​ లావాదేవీల వాల్యూమ్‌‌‌‌‌‌లు సగటున దాదాపు 50 శాతం పెరిగాయి. ‘‘బీఎన్​పీఎల్​ వంటి యూజర్​ ఫ్రెండ్లీ ఫైనాన్షియల్​ ప్రొడక్టుల వల్ల జనం బాగా ఖర్చు పెడుతూనే మ్యూచువల్​ ఫండ్స్ వంటి ద్వారా డబ్బు పొదుపు కూడా చేస్తున్నారు. షేర్ల ట్రేడింగ్​ చేసే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్​ వేవ్​​ నుంచి డిజిటల్​ ట్రాన్సాక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. సెకండ్​ వేవ్​ తరువాత కిరాణా షాపుల వంటి ఆఫ్​లైన్​ సంస్థలు కూడా డిజిటల్​ పేమెంట్స్​కు మారాయి”అని రేజర్​పే కో–ఫౌండర్​, సీఈఓ హర్షిల్​ మాథుర్​ చెప్పారు. మొత్తం ట్రాన్సాక్షన్లలో పానీయాలు, ఫైనాన్షియల్​ సర్వీసులు, యుటిలిటీలు, ఈ–కామర్స్ వాటా ఎక్కువగా ఉంది. హౌజింగ్​, రియల్టీ సెక్టార్లలోనూ డిజిటల్​ పేమెంట్స్​ వేగంగా పెరుగుతున్నాయి. ఇవి  2020తో పోలిస్తే గత ఏడాది 315.65 శాతం గ్రోత్​ను సాధించాయి. ఫాంటసీ లీగ్​, ఈస్పోర్ట్స్​ వంటి వాటి వల్ల గేమ్​​ డెవలపర్​టూల్స్​కు డిమాండ్​ పెరిగింది. ఈ తరహా ట్రాన్సాక్షన్లు 365.83 శాతం గ్రోత్​ సాధించాయి. టైర్​–3 సిటీల్లో ఆన్​లైన్​ గేమింగ్​ ట్రాన్సాక్షన్​ వాల్యూమ్స్​ 45.56 శాతం పెరిగాయి. వర్క్​ ఫ్రం హోమ్​ కల్చర్​ వచ్చాక చాలా మంది ప్రొఫెషనల్స్​ సొంతూళ్లకు వెళ్లి పనిచేస్తున్నారు. అందుకే చిన్న సిటీల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 2020తో పోలిస్తే 2021లో 210 శాతం గ్రోత్​ కనిపించిందని రేజర్​పే రిపోర్టు పేర్కొంది.