షట్లర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌...సెప్టెంబర్ 5 నుంచి చైనా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ 1000 టోర్నీ

షట్లర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌...సెప్టెంబర్ 5 నుంచి చైనా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ 1000 టోర్నీ

చాంగ్జౌ (చైనా): వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి మెడల్‌‌‌‌‌‌‌‌ (బ్రాంజ్‌‌‌‌‌‌‌‌) గెలిచి జోరులో ఉన్న ఇండియా స్టార్ షట్లర్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌  మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టాడు. ఈ టోర్నీని ఉపయోగించుకొని చైనాలోనే ఈ నెల 23 నుంచి జరిగే ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ముందు టాప్ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని ఇండియా షట్లర్లు ఆశిస్తున్నారు.  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు చివరి నిమిషంలో వైదొలగడంతో విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పోటీ లేకుండా పోయింది. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్​ తొలి రౌండ్​లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. మలేసియాకు చెందిన జె యంగ్‌‌‌‌‌‌‌‌తో తల పడనున్నాడు. లక్ష్య సేన్ డెన్మార్క్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆండర్స్ ఆంటోన్సెస్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ జోడీ సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్ శెట్టిపై అంచనాలున్నాయి.   విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్ ట్రీసా జాలీ–పుల్లెల -గాయత్రి జంట అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.