దుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

దుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

ఈనెల 10న ఫలితాలు

దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని నిలిపేశాయి. ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల తరపున ముఖ్య నేతలందరూ దుబ్బాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్నిపతాక స్థాయిలో హోరెత్తించారు. పల్లె పల్లెలో గల్లీ గల్లీలో పాదయాత్రలు.. బైకు ర్యాలీలతో మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు  అన్ని పార్టీల నేతలు.. . ఎక్కడిక్కడ ప్రచారాన్ని నిలిపేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం 23 మంది పోటీలో ఉన్నారు. కరోనా నిబంధనలు ఇబ్బందులకు గురిచేస్తున్నా గత కొన్నిరోజులుగా దుబ్బాకలో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచారంతో హోరెత్తించాయి. సాయంత్రంతో ప్రచారానికి తెరపడగా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు.

 

for more news…

శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే

https://www.v6velugu.com/7-best-winter-fruits-for-immunity-you-must-stock-up-this-season/

ఫుడ్‌‌శ్వాప్‌‌తో బరువు తగ్గొచ్చు!

https://www.v6velugu.com/lose-weight-with-foodswap/