బైజూస్ మరో రౌండ్ లేఆఫ్స్.. పనితీరు బాగా లేదని 100మందిని తీసేసిండ్రు..

బైజూస్ మరో రౌండ్ లేఆఫ్స్.. పనితీరు బాగా లేదని 100మందిని తీసేసిండ్రు..

ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ (BYJU'S) మరో సారి లేఆఫ్స్ పర్వం మొదలుపెట్టింది. తొలి విడతలో 2వేల 5వందల మందిన తొలగించిన కంపెనీ.. తాజాగా మరో 100 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. కాగా వీరు ఏ విభాగానికి చెందిన ఎంప్లాయీస్ అన్న విషయం మాత్రం చెప్పలేదు. కానీ ఈ తొలగింపులు సేల్స్, మార్కెటింగ్ బృందాలకు సంబంధించినవిగా తెలుస్తోంది. గత ఆరు నెలల్లో BYJUలో ఇది రెండవ రౌండ్ తొలగింపులు.

ఫిబ్రవరి 2023లో, కంపెనీ 2వేల 5 వందల మంది ఉద్యోగులను తొలగించింది. “క్రమానుగత పనితీరు సమీక్షలో భాగంగా, పనితీరు మెరుగుదల ప్రణాళిక తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన 100 మంది వ్యక్తులను తీసివేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ తొలగింపు అనేది కేవలం వారి పనితీరు ఆధారంగానే జరిగింది. ఏ విధంగానూ ఇది ఖర్చు తగ్గించే ప్రయత్నం కాదు”అని బైజు ప్రతినిధి అన్నారు.

ఈ తొలగింపులు ఎడ్టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కఠినమైన సమయాలకు సంకేతం. ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్లు పెరగడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోయింది.  ఇటీవలి కాలంలో ఉద్యోగులను తొలగించిన ఎడ్ టెక్ కంపెనీల్లో ఉన్నది BYJU'S ఒక్కటే కాదు.. అందులో అనాకాడెమీ, వేదాంతు, లిడో లెర్నింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఎడ్టెక్ పరిశ్రమలో తొలగింపులు ఈ రంగానికి ఎదురుదెబ్బగా మారాయి. ఇది ఒకప్పుడు అత్యంత డెవలపుడ్ యాప్ గా పేరు పొందినా.. ఈ మధ్య కాలంలో సాగుతున్న తొలగింపులు పరిశ్రమ పరిపక్వత చెందుతోందని, మరింత స్థిరంగా మారుతున్నాయని సంకేతమని నిపుణులు చెబుతున్నారు.