
టైరు లోపలి నుంచి అవతలివైపుకు పోదామనుకుందో ఏమో.. ఇదిగో ఇలా ఇరుక్కుపోయింది ఈ కుక్క. ముందుకు పోలేక, వెనక్కు రాలేక ముప్పు తిప్పలు పడింది. యానిమల్ సర్వీసెస్ అధికారులొచ్చి దానిని సేఫ్గా తీసే వరకు అది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. టైర్లో ఇరుక్కుపోయిన ఆ కుక్క ఫొటో, దానిని బయటకు తీసిన వీడియోను రివర్సైడ్ కౌంటీ యానిమల్ సర్వీసెస్ అధికారులు ట్విట్టర్లో షేర్ చేసే సరికి అది కాస్త వైరల్ అయింది. ముందు యానిమల్ సర్వీసెస్ అధికారులు ప్రయత్నించినా దానిని బయటకు తీయలేకపోయారు. అప్పటికే ఆ కుక్క మెడ బాగా వాచిపోయింది. దీంతో ఫైర్సర్వీసెస్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి టైర్ రిమ్మును కొంచెం కట్ చేసి కుక్కను బయటకు తీశారు.
see more news సంచలన స్కామ్..రూ. 4,26,000 కోట్లు లూటీ