ట్రంప్​కు ఊరట .. ప్రెసిడెన్షియల్​ అభ్యర్థిగా కొనసాగించిన కాలిఫోర్నియా

ట్రంప్​కు ఊరట ..  ప్రెసిడెన్షియల్​ అభ్యర్థిగా కొనసాగించిన కాలిఫోర్నియా

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా బరిలో దిగాలనుకుంటున్న ట్రంప్​కు కాలిఫోర్నియా రాష్ట్ర నిర్ణయం  ఊరటనిచ్చింది. అధ్యక్షుడిగా పోటీకి అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు, ప్రెసిడెన్షియల్ అభ్యర్థి పోటీ నుంచి ఆయన్ను నిషేధిస్తూ మైన్ రాష్ట్రం నిర్ణయించడంతో ట్రంప్ కు ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. 

అయితే కాలిఫోర్నియా రాష్ట్ర సెక్రటరీ చేసిన తాజా ప్రకటన ఆయనకు ఊరటనిచ్చింది. అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరును తొలగించాలన్న వినతులను కాలిఫోర్నియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ డాక్టర్ షిర్లీ వెబర్ తొసిపుచ్చారు. 2024 ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా రాష్ట్రంలో ఆయన్ను కొనసాగించనున్నట్లు తెలిపారు.  

ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను అనర్హులుగా చేయాలా? వద్దా? అనేది కోర్టులు మాత్రమే నిర్ణయిం చగలవని.. “రూల్ ఆఫ్ లా’’ ఇదే చెప్తున్నదని ఆమె స్పష్టం చేశారు.