కివీస్ పై ఆసీస్ ఊహించని విక్టరీ

కివీస్ పై ఆసీస్ ఊహించని విక్టరీ

వన్డే సిరీస్ భాగంగా ఇవాళ న్యూజిలాండ్ జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియా  థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 232 రన్స్ చేసింది. కాన్వే(46), కేన్ విలియమ్సన్(45), టామ్ లాథమ్(43) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మ్యాక్సివెల్ 4 వికెట్లతో చెలరేగగా.. హజల్ హుడ్ (3), ఆడామ్ జంపా, మిచెల్ స్టార్క్ చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఈజీగా విక్టరీ కొట్టేలాగే కనిపించింది. అయితే 11 పరుగుల దగ్గర ఆరోన్ ఫించ్ ఎల్బీడబ్యూతో ఔట్ కాగా.. వెంటనే మరో నాలుగు వికెట్లో కోల్పోయిన ఆసీస్ 44/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ(85), కామెరాన్ గ్రీన్(89) ఆచితూచి ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 158 భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను వన్ సైడ్ చేశారు.

అయితే చివర్లో అనవసమైన షాట్ తో అలెక్స్ క్యారీ 202 పరుగుల వద్ద ఔట్ అయ్యిండు. ఆ వెంటనే వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ కూడా ఔట్ కావడంతో ఆస్ట్రేలియా 207/8 కోల్పోయి మరోసారి కష్టాలను కొనితెచ్చుకుంది. మ్యాచ్ గెలవాడినికి ఇంకా 28 రన్స్ కావాలి. చేతిలో రెండే వికెట్స్ ఉన్నాయి. అటువంటి సమయంలో మరోసారి హీరోలా మ్యాచ్ ని గ్రీన్ తన చేతిలోకి తీసుకున్నాడు.  ఫామ్ లో ఉన్న గ్రీన్ .. ఆడామ్ జంపాతో కలిసి ఇన్నింగ్స్ ఫినిష్ చేశాడు. చివర్లో ఆడామ్ జంపా ఫోర్ కొట్టడంతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన ఆసీస్.. సొంతగడ్డపై 2 వికెట్ల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. దీంతో 3 వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో లీడ్ లో ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మళ్లీ ఆస్ట్రేలియాకు అదే సీన్ రిపీట్ లా కనిపించినా చివరకు గెలిచి గట్టెక్కింది.