బ్రెజిల్కు షాక్..1-0తో కామెరూన్ గెలుపు

బ్రెజిల్కు షాక్..1-0తో కామెరూన్ గెలుపు

ఫిఫా ప్రపంచకప్ 2022లో బ్రెజిల్కు కామెరూన్ షాకిచ్చింది. గ్రూప్ దశలో భాగంగా కామెరూన్తో ఆడిన బ్రెజిల్..1–0 తేడాతో ఓడిపోయింది. ఐదు సార్లు చాంపియన్.., బలమైన టీమ్గా పెరొందిన బ్రెజిల్‌..ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. అయితే అదనపు సమయంలో కామెరూన్ తరపున విన్సెంట్‌ అబూబాకర్‌  గోల్‌ సాధించడంతో బ్రెజిల్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఓడినా బ్రెజిల్ నాకౌట్ దశకు చేరింది. 

హోరా హోరీగా..  

ఫస్టాఫ్ రెండు జట్ల మధ్య హోరా హోరీగా సాగింది. ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ముఖ్యంగా కామెరూన్ గోల్ పోస్టుపై బ్రెజిల్ పలుమార్లు దాడులు చేసింది. గోల్ సాధించేందుకు అవకాశాలను సృష్టించుకున్న బ్రెజిల్..పదే పదే దాడులు చేసినా..గోల్ మత్రం సాధించలేకపోయింది. ఇక సెకండాఫ్ లో అదే తీరు. దీంతో మ్యాచ్‌ పేలవమైన డ్రా అవుతుందని అంతా అనుకున్నారు. అయితే స్టాపేజ్‌ టేమ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ జిరోమ్‌ ఎన్‌గామ్‌ కొట్టిన క్రాస్‌ను అబూబాకర్‌ హెడర్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో అనూహ్యంగా  కామెరూన్‌ 1–0తో విజయం సాధించింది. 

తొలి ఆఫ్రికా జట్టు..

అటు 2002 తర్వాత ఫిఫా వరల్డ్ కప్ లో  కామెరూన్‌ విజయం సాధించడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ టోర్నీలో బ్రెజిల్‌ను ఓడించిన తొలి ఆఫ్రికా జట్టుగా కామెరూన్‌ చరిత్ర సృష్టించింది.  ఈ గేమ్ లో ఓడిన బ్రెజిల్.. 6 పాయింట్లతో గ్రూప్‌  టాపర్ గా నిలిచింది. అటు రౌండ్ 16లో బ్రెజిల్ సౌత్ కొరియాతో ఆడనుంది.