వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఖమ్మంలో టీఆర్ఎస్ ధర్నాకు డబుల్ బెడ్ రూమ్ లబ్ది దారులు రావాలంటూ మైక్ లో ప్రచారం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం అర్బన్ ప్రాంతంలోని టేకులపల్లిలో ఇటీవల డబల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు రైతు ధర్నాకు పాల్గొనాలని..ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తమకు తెల్సి పోతుందని బాహాటంగా మైక్ ప్రచారం చేశారు టీఆర్ఎస్ నాయకులు. వారిని బస్సులో ఎక్కించి ధర్నాకు తీసుకోవడం గమనార్హం.
