హయ్యర్​ ఎడ్యుకేషన్​ కు కెనడా.. యూకే బెటర్​ 

హయ్యర్​ ఎడ్యుకేషన్​ కు కెనడా.. యూకే బెటర్​ 

విదేశాల్లో హయ్యర్​ ఎడ్యుకేషన్​కు వెళ్లే విద్యార్థుల​ సంఖ్య గత దశాబ్ద కాలంగా పెరుగుతోంది. కొవిడ్​ ఎఫెక్ట్​తో అబ్రాడ్​ ఎడ్యుకేషన్​కు కొంతకాలం ఆటంకాలు ఎదురైనా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఏ దేశాల్లో ఎలాంటి కోర్సులకు డిమాండ్​ ఉంది, ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ ప్యాట్రన్,​ ప్రస్తుత పరిస్థితులపై ఈ వారం..
ఫారిన్​ చదువులపై కరోనా వైరస్  తీవ్ర ప్రభావం చూపించింది. 2020 మార్చిలో మొదలైన కొవిడ్​ ఎఫెక్ట్​ అబ్రాడ్​ స్టడీస్​కు సిద్ధమైన స్టూడెంట్స్​ను ఇబ్బందికి గురి చేసింది. ముఖ్యంగా విద్యార్థులకు సకాలంలో ఫైనల్​ ఇయర్​ ఎగ్జామ్స్​ పూర్తికాకపోవడంతో యూనివర్సిటీల్లో అడ్మిషన్ సమస్యగా మారింది. చాలా దేశాలు సంవత్సరానికి మూడు సార్లు అడ్మిషన్స్​ తీసుకుంటాయి. స్ప్రింగ్​ సీజన్​ (జనవరి–ఫిబ్రవరి), సమ్మర్​ సీజన్​ (మే), ఫాల్​ సీజన్​ (సెప్టెంబర్​) లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ కొవిడ్​ పాండమిక్​తో అన్ని స్కూల్స్​, కాలేజ్​లు మూసివేయడంతో ఫైనల్​ ఇయర్​ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో అబ్రాడ్​లో చదివేందుకు ప్లాన్​​ వేసుకున్న విద్యార్థులకు సమస్యగా మారింది. కరోనా సమయంలో చాలా దేశాలు తమ సరిహద్దులను మూసివేసి, విదేశీ ప్రయాణాలు నిలిపివేశాయి.   
అడ్మిషన్స్​ పెరుగుతున్నాయ్​
కొవిడ్​ ప్రభావంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ విధించిన ఆంక్షలతో యూకే, కెనడా దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో యూకేలో చదువు పూర్తయ్యాక స్టూడెంట్స్​కు పోస్ట్ వర్క్​ పర్మిట్​ 6 నెలలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలకు పెంచింది. దీంతో యూకే వెళ్లడానికి విద్యార్థులు ఇంట్రస్ట్​గా ఉన్నారు.  కెనడా కరోనా సమయంలో విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇండియా నుంచి ఎక్కువ స్టూడెంట్స్​ వెళ్తున్నారు. బ్రిటన్​ యూరోపియన్​ యూనియన్​ నుంచి బయటకు వెళ్లడంతో ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీ హెడ్​క్వార్టర్స్​ ఐర్లాండ్​కు తరలివెళ్లాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఇండియన్​ స్టూడెంట్స్​ ఐర్లాండ్​లో హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఛాన్స్​ కోసం ఎదురుచూస్తున్నారు. జర్మనీలో స్టెమ్​ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్​, మ్యాథ్స్​) కోర్సులకు డిమాండ్‌‌ ఉంది. యూరప్​లోని ఫిన్లాండ్​, ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్​ దేశాల్లో ఐటీ, లా, డిజైన్​, స్పోర్ట్స్​ మేనేజ్​మెంట్​, టూరిజం అండ్​ హాస్పిటాలిటి, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఇండియన్​ స్టూడెంట్స్​ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 
ఎంబీఏకు జీమ్యాట్‌‌
యూఎస్​ఏలో స్టెమ్​ (సైన్స్​, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్​) కోర్సుల్లో మాస్టర్స్​, పీహెచ్​డీ చేయాలంటే మంచి అకడమిక్​ మెరిట్​తో పాటు జీఆర్​ఈ ( గ్రాడ్యుయేట్​ రికార్డ్​ ఎగ్జామ్​)లో మంచి స్కోర్​ సాధించాలి. దీంతో పాటు ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ ప్రొఫిషీయన్సీ టెస్ట్​ పాసవ్వాలి. జీఆర్​ఈతో పాటు టోఫెల్​, ఐఈఎల్​టీఎస్​, పీటీఈ లాంటి ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​తో కూడా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్​ పొందవచ్చు. అమెరికాలో ఎంబీఏ చేయాలంటే జీమ్యాట్​ ( గ్రాడ్యుయేట్​ మేనేజ్​మెంట్​అడ్మిషన్​ టెస్ట్​) తప్పనిసరి. జీఆర్​ఈ, జీమ్యాట్​ టెస్టులో వచ్చిన స్కోర్​ ఆధారంగా యూఎస్​ఏతో పాటు కెనడా, సింగపూర్​, జర్మనీ దేశాల్లోని వర్సిటీల్లో అడ్మిషన్స్​ కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో చాలా వర్సిటీలు ఎంట్రన్స్​ టెస్టులు పరిగణనలోకి తీసుకోకుండా అకడమిక్​ మెరిట్​ ఆధారంగా ప్రవేశాలు కల్పించాయి. 
ఇండియన్స్​ డ్రీమ్​ యూఎస్​ఏ
అబ్రాడ్​ ఎడ్యుకేషన్​ అంటే భారతీయులకు ఎక్కువగా గుర్తొచ్చేది అమెరికా. బైడెన్​ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ భారత విద్యార్థులు అమెరికాలో చదివేందుకు పోటీ పడుతున్నారు. 2021లో రికార్డు స్థాయిలో 60వేల మంది విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్స్​ పొందారు. కరోనా నేపథ్యంలో జీఆర్​ఈ, జీమ్యాట్​ లాంటి ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ సైతం లేకుండా అకడమిక్​ మెరిట్​ ఆధారంగా కొన్ని వర్సిటీలు అడ్మిషన్స్​ కల్పించాయి. అబ్రాడ్​లో చదువుకోవడానికి ఎడ్యుకేషన్​ లోన్​లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉండడంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 
– యూఎస్​ఏ, యూకే, కెనడా, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాల్లో స్టెమ్​ ప్రోగ్రామ్స్​తో పాటు హ్యూమానిటీస్​, ఫైన్​​ ఆర్ట్స్​ అండ్​ కామర్స్​ కోర్సులు కూడా అట్రాక్టివ్​గా ఉంటూ మంచి ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

విదేశాల్లో భారతీయ విద్యార్థులు

యూఏఈ    2,19,000
కెనడా    2,15,720
యూఎస్​ఏ    2,11,930
ఆస్ట్రేలియా    92,383
సౌదీ అరేబియా    80,800
యూకే    55,465
ఒమన్​    43,600
న్యూజిలాండ్​    30,000
చైనా    23,000
జర్మనీ    20,810

స్టెమ్‌‌ కోర్సులకు డిమాండ్​
అబ్రాడ్​లో హయ్యర్​ ఎడ్యుకేషన్​ కోసం వెళ్లే విద్యార్థులు ఎక్కువగా స్టెమ్‌‌ కోర్సులైన ఇంజినీరింగ్​, మేనేజ్​మెంట్​ కోర్సుల్లో చేరుతున్నారు.  బెస్ట్‌‌ కెరీర్‌‌ కోసం డాటా ఎనలటిక్స్​, బిజినెస్​ ఎనలటిక్స్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, నానో టెక్నాలజీ, రోబోటిక్స్​​ ప్రోగ్రామ్స్​లో చేరేందుకు ఇంట్రస్ట్​గా ఉన్నారు. కొందరు ఫార్మాసీ, సైకాలజీ, లా, బేసిక్ సైన్స్​ ప్రోగ్రామ్స్​, ఇన్విరాన్​మెంటల్​​ స్టడీస్​లో జాయిన్​ అవుతున్నారు.