ఒట్టావా: భారత్‌తో దౌత్యసంబంధా లపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. దేశంలోని మిగిలిన భారత దౌత్యవేత్తలపై కూడా నిఘా పెట్టామని చెప్పారు. కెనడాలో మిగిలిన భారత దౌత్యవేత్తలను కూడా బహిష్కరిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మెలానీ బదులిస్తూ.. ‘‘వారిపై కూడా నిఘా ఉంచాం.
రుగురు దౌత్యవేత్తలను బహిష్కరించాం. మిగిలినవారు వాంకోవర్, టొరంటోలో ఉన్నారు’’ అని కామెంట్ చేశారు. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించే లేదా తన ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే ఏ దౌత్యవేత్తలనూ కెనడా సహించ దన్నారు. భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసు వెళ్లగక్కారు.