తెగిన పిలాయిపల్లి కాల్వ.. నీటమునిగిన పొలాలు

తెగిన పిలాయిపల్లి కాల్వ.. నీటమునిగిన పొలాలు

చిట్యాల, వెలుగు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిలాయిపల్లి కాల్వ కట్ట తెగడంతో పక్కనే ఉన్న పొలాలు నీట మునిగాయి. పెద్దకాపర్తి చెరువు నుంచి పిలాయిపల్లి కాల్వ ద్వారా ఆరెగూడెం, మోర్సుగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ గ్రామాల చెరువుల్లోకి నీరు చేరుతుంది.

 ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వ కట్టకు గండి పడింది. గండిని పూడ్చాలని రైతులు కోరినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో మంగళవారం కాల్వకట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో పక్కనే ఉన్న దొడ్డి అంజయ్య, అండమ్మ, మూరాల శేఖర్, పెద్ద అంజయ్య, బైరికొండ లింగయ్య, శ్రీను, ఆరూరి గంగయ్య, దినేశ్, మల్లయ్యకు చెందిన 50 ఎకరాల వరి నీటిపాలైంది.