చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు

చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు
  • చైనీయులకు ఇచ్చిన టూరిస్టు వీసాలు రద్దు
  • డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : చైనాకు మనదేశం షాక్ ఇచ్చింది. ఆ దేశస్థులకు ఇచ్చిన టూరిస్టు వీసాలను రద్దు చేసింది. గ్లోబల్ ఎయిర్ లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘చైనీయులకు జారీ చేసిన టూరిస్టు వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ సిటిజన్స్, ఇండియా జారీ చేసిన నివాస అనుమతి, వీసా, ఈ–వీసా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓ) కార్డులు, డిప్లమాటిక్ పాస్ పోర్టు ఉన్నోళ్లను మాత్రమే ఇండియాలోకి అనుమతిస్తం” అని సర్క్యులర్  జారీ చేసింది. కాగా, చైనాలో చదువుకుంటున్న 22 వేల మంది మనోళ్లు కరోనా కారణంగా దేశానికి తిరిగొచ్చారు. వాళ్లిప్పుడు తిరిగి వెళ్దామంటే చైనా రానివ్వడంలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ చైనా స్పందించలేదు. దీంతో డ్రాగన్​కు కౌంటర్​గా మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది.