రెంట్​కు ఉంటున్న కేన్సర్ పేషెంట్​ను ఇంట్లోకి రానియ్యలే

రెంట్​కు ఉంటున్న కేన్సర్ పేషెంట్​ను ఇంట్లోకి రానియ్యలే
  • ఇంటి ఓనర్ నిర్వాకం

బాలసోర్(ఒడిషా): తన ఇంట్లో అద్దెకుంటున్న కేన్సర్ పేషెంట్​ను, అతని కుటుంబ సభ్యులను ఇంటి ఓనర్ లోపలికి రానివ్వలేదు. ఒడిషాలోని బాలసోర్​టౌన్​లో ఓ రెంటెడ్ హౌస్ లో నివాసం ఉంటున్న కేన్సర్ పేషెంట్ భువనేశ్వర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొంది శుక్రవారం డిశ్చార్చి అయ్యారు. కరోనా నేపథ్యంలో హాస్పిటల్ నుంచి వచ్చిన వారిని ఇంట్లోకి రానివ్వకుండా ఓనర్ అడ్డుకున్నారు. దీంతో ఏడెనిమిది గంటలపాటు వారు ఇంటి బయటే వెయిట్ చేయాల్సి వచ్చింది. చేసేదేమీలేక ఆ రోగి అధికారులకు కంప్లైంట్ చేశారు. వారు స్పాట్ కు చేరుకుని ఇంటి యజమానితో మాట్లాడటంతో కేన్సర్ పేషెంట్​ను, అతని భార్యను ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించారు. ‘‘మేము ఓనర్ తో మాట్లాడిన తర్వాత.. రోగి, అతని భార్య ఇంట్లో ఉంటారని, వారి కుమారులు బంధువుల దగ్గర ఉండాలని నిర్ణయించారు. ఇలాంటి అమానవీయ చర్యకు వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు’’ అని అధికారి ఒకరు మీడియాతో చెప్పారు.