Health Alert : సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ ముప్పు.. ఎలుకలపై ప్రయోగంతో వెల్లడి

Health Alert : సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ ముప్పు.. ఎలుకలపై ప్రయోగంతో వెల్లడి

ప్రజెంట్ లైఫ్ సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. చాలా మందికి సెల్ఫోన్ లేకపోతే రోజు గడవదు. కామన్ మెన్ నుంచి బిజినెస్ మెన్ వరకు ప్రతి ఒక్కరి ఫస్ట్ చాయిస్ మొబైల్. ఇంటర్నెట్ ని అరచేతిలోకి తీసుకొచ్చిన ఫోన్ తో చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. మెదడు, చెవి సంబంధిత సమస్యలు వస్తాయని ఎన్నో ప్రయోగాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. తాజాగా కేన్సర్ కూడా వస్తుందని తేలింది. కొన్ని యూనివర్సిటీలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ నిజం తెలిసింది. 

మొదట్లో ఎలుకలు, మూగజీవాలపై ప్రయోగాలు చేసిన పరిశోధకులు.. కొన్ని నెలల తరువాత వాటి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రయోగానికి ముందు ఆరోగ్యంగా ఉన్న జీవులు.. తర్వాత ఆరోగ్య
సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తించారు. అంతేకాదు.. కేన్సర్ లక్షణాలు కూడా బయటపడ్డాయి. అయితే, మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల్లో ఈ లక్షణాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నవాళ్లు.. జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.