మరికల్​లో జవాన్​ మురళి నాయక్​కు ఘన నివాళి

మరికల్​లో జవాన్​ మురళి నాయక్​కు ఘన నివాళి

మరికల్, వెలుగు: భారత్,​- పాక్​ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్​ మురళి నాయక్​ కు శుక్రవారం మరికల్​లో జేఏసీ నేతలు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆయన ఫొటోతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జై జవాన్​ అంటూ నినాదాలు చేశారు. చౌరస్తాలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

పెబ్బేరు: ఆపరేషన్​ సింధూర్–2కు సంఘీభావంగా హిందూ జాగృతి సభ్యులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుభాష్​​చౌరస్తా నుంచి ర్యాలీ చేపట్టి, భారత్​ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.