ఫ్రెంచ్ రివియెరా తీరాన సన్‌సెట్ వేళ.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మెరిసిపోయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes 2024) రెడ్ కార్పెట్‌పై తన ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అలియా.. ఇప్పుడు ( Cannes Film Festival 2026 ) తన సెకండ్ లుక్‌తో ఇంటర్నేషనల్ మీడియా మైండ్ బ్లాక్ చేసింది. అసలు సిసలైన పాతకాలపు రాచరికం, సాఫ్ట్ గ్లామర్ కలగలిపిన ఒక క్రేజీ ఫ్యాషన్ విజువల్ వండర్‌ను పరిచయం చేసింది.
దేవకన్యలా మెరిసిపోతున్న బ్యూటీ..
ఈ సారి అలియా ఒక డ్రీమీ కస్టమ్ అవుట్‌ఫిట్ ఎంచుకుంది. 'తమరా రాల్ఫ్' హాట్ కోట్యూర్ డిజైన్ చేసిన సాఫ్ట్ బ్లష్-టోన్డ్ ఫిట్టెడ్ గౌనులో ఆమె దేవకన్యలా మెరిసిపోయింది. ఆ శిల్పం లాంటి స్కల్ప్టెడ్ నెక్ లైన్ అలియా లుక్‌కు ఒక రోమాంటిక్ అండ్ లగ్జరీ వైబ్‌ను తీసుకొచ్చింది.
నెవర్ బిఫోర్ జ్యువెలరీ మూమెంట్!
ఈ అవుట్‌ఫిట్ ఒకెత్తయితే, అలియా ధరించిన నెక్లెస్ మాత్రం నెక్ట్స్ లెవల్ అసెట్ అనే చెప్పాలి. 'ఆమ్రపాలి జ్యువెల్స్' ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ రేర్ స్టేట్‌మెంట్ నెక్లెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, ఇందులో ఏకంగా 168.27 క్యారెట్ల అత్యంత అరుదైన పగడాలు ఉపయోగించారు. అంతేకాదు.. ఆ నెక్లెస్ సెంటర్‌లో మెరుస్తున్న 5.53 క్యారెట్ల గొల్కొండ-టైప్ 2A డైమండ్ ఈ లుక్‌కే హైలైట్ గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రాల్లో ఇదొకటి. ఈ రాయల్ టచ్‌కు తోడు చోపార్డ్ (Chopard) బ్రాండ్ నుంచి వచ్చిన స్క్వేర్-కట్ డైమండ్ ఈరింగ్స్, అస్చెర్-కట్ స్టన్నర్ రింగ్ అలియాను ఒక క్వీన్‌లా మార్చేశాయి.
ALSO READ : 6 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ‘అవతార్ 3’..
సన్‌సెట్ ఇన్ కాన్స్ మ్యాజిక్
స్టార్ స్టైలిస్ట్ రియా కపూర్, సాన్యా కపూర్‌తో కలిసి ఈ లుక్‌ను ప్లాన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. దీనికి “సన్‌సెట్ ఇన్ కాన్స్” అని పెట్టిన క్యాప్షన్ నూటికి నూరు పాళ్ళు సరిపోయింది. మేకప్ ఆర్టిస్ట్ పునీత్ బి సైనీ సాఫ్ట్ గ్లోయింగ్ మేకప్‌తో, హెయిర్ స్టైలిస్ట్ స్టెఫాన్ లాన్సియన్ ఓపెన్ వేవీ హెయిర్‌తో అలియాను ఎఫర్ట్‌లెస్ బ్యూటీగా చూపించారు. ఫోటోగ్రాఫర్ మార్కో బహ్లర్ క్లిక్ చేసిన సన్‌కిస్డ్ పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం 'క్వైట్ లగ్జరీ' థీమ్‌తో అలియా భట్ క్రియేట్ చేసిన ఈ ఫ్యాషన్ మూమెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కేవలం డిజైనర్ బట్టలు వేసుకోవడమే కాదు, క్లాస్ అంటే ఇదని అలియా మరోసారి ప్రూవ్ చేసిందని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
