నన్ను అన్‌‌ఫిట్‌‌ అంటే ఒప్పుకోను

నన్ను అన్‌‌ఫిట్‌‌ అంటే ఒప్పుకోను

చెన్నై: గత ఐపీఎల్‌లో ఫ్లాప్ షో కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో సత్తా చాటుతోంది. వరుసగా రెండు గెలుపులతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యంలో తమ సక్సెస్‌‌పై చెన్న కెప్టెన్ ధోని స్పందించాడు. రవీంద్ర జడేజా, మెయిన్ అలీ బౌలింగ్‌‌ను మెచ్చుకున్నాడు. ఇక తన వయసు, ఫిట్‌‌నెస్ పై వస్తున్న కామెంట్ల మీద 39 ఏళ్ల ధోని సీరియస్ అయ్యాడు. తనను ఎవరైనా అన్‌ఫిట్ అని పిలిస్తే నచ్చదని చెప్పాడు. 

‘ఏ ప్లేయర్‌కైనా వాళ్లు ఆడుతున్నప్పుడు ఎవరైనా అన్‌ఫిట్ అని పిలిస్తే నచ్చదు. ఆటతీరు గురించి ఎవరూ హామీ ఇవ్వలేం. నేను 24 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కూడా నా పెర్ఫామెన్స్ గురించి నేను హామీ ఇవ్వలేదు. అదే టైమ్‌లో 40 ఏళ్లకు చేరుకున్నా పెర్ఫామెన్స్ గురించి గ్యారెంటీ ఇవ్వలేను. నేను ఫిట్‌గా లేనని ఎవరూ అనకుంటే చాలు. దాన్ని పెద్ద సానుకూలతగా చూస్తా. ఫిట్‌నెస్‌‌లో యంగ్‌స్టర్స్‌‌తో పోటీ పడుతున్నా. వాళ్లు చాలా ఫిట్‌‌గా, ఫాస్ట్‌గా ఉన్నారు. వారిని ఛాలెంజ్ చేయడం నాకిష్టం’ అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌‌లో మాహీ చెప్పుకొచ్చాడు.