ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత : ఎమ్మెల్యే శ్రీ గణేశ్

ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత : ఎమ్మెల్యే శ్రీ గణేశ్

పద్మారావునగర్, వెలుగు: ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత అని కంటోన్మెంట్​ఎమ్మెల్యే శ్రీగణేశ్​అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని ఓ గార్డెన్స్ లో టెర్రస్ గార్డెన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు.  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టెర్రస్ గార్డెన్ కు సంబంధించిన మొక్కలు, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని సూచించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ పాల్గొన్నారు.