రాజన్నసిరిసిల్ల, వెలుగు: 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్దంలో వీరమరణం పొందిన కెప్టెన్ రఘునందర్ రావు విగ్రహాన్ని ఆయన స్వగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా చిన్నబోనాలలో ఆవిష్కరించారు. మంగళవారం రఘునందన్ రావు59వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చిన్నబోనాల కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ 1965 యుద్ధంలో కెప్టెన్ రఘునందన్ రావు వీరోచితంగా పోరాడరన్నారు.
ఆయన జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు బోనాలలో సుమారు 8 ఎకరాల స్థలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో కెప్టెన్ కుటుంబ సభ్యులు డాక్టర్ బోనాల సరళ, సుమతి, డాక్టర్ కమల, వందిత, రంజిత, ప్రణతి పాల్గొన్నారు.