జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం

జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఒ కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌తో వెళ్తూన కారు డివైడర్ ను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొందరు యువతులు మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. మద్యం పుచ్చుకొని కారులో షికార్లు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి దూసుకువస్తుండటంతో భయంతో జనం పరుగులు తీశారు.

యువతులను అదుపులోకి తీసుకొని..కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదానికి గురైన కారు రోడ్డుపై నిలిపోవడంతో టోవింగ్ వాహనంతో పోలీసు స్టేషన్ కు తరలించారు. కారు ఫిల్మ్ నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.