ఇంట్లోనే ఉన్న కారు నంబర్ పై 15 చలానాలు.. ఓనర్ పరేషాన్

ఇంట్లోనే ఉన్న కారు నంబర్ పై 15 చలానాలు.. ఓనర్ పరేషాన్

ఒక కారుపై ట్రాఫిక్ పోలీసులు 15 చలానాలు విధించారు. అయితే ఆ కారు  కొన్ని నెలలుగా ఇంట్లోని అపార్ట్ మెంట్ లో పార్క్ చేసి ఉన్న కారుపై. ఇంటికి చలానాలు రావడంతో ఆశ్చపోయారు ఆ కారు యజమాని. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఘజియాబాద్‌‌లో ఉంటున్న అరుణ్ శర్మ అనే వ్యక్తికి చెందిన కారు పై 15 చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. అయితే తాను కొత్త మోటారు చట్టం వచ్చిన తర్వాత… ఆగస్టు నుంచి కారును బయటకు తీయలేదని తెలిపారు.దీనిపై స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

కొన్ని నెలలుగా తాను ఉండే అపార్ట్ మెంట్ లోనే పార్కింగ్ చేసి ఉందని తెలిపారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తన కారుకు చలానా ఎందుకు విధించారో తానే తెలుసుకున్నారు. ఓ  యువకుడు ఆ కారు నంబరుతో నకిలీ నంబరు ప్లేటు తయారు చేయించుకుని అతని కారులో తిరుగుతున్నాడని అరుణ్ గుర్తించారు. తన కారును పోలీ ఉన్న కారుకు ఆ నంబర్ ప్లేట్ పెట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది. ఎలాగైనా అతడిని పోలీసులకు పట్టించాలని ఓ రోజు ఆ కారును వెంబడించారు. ఘాజియాబాద్ రోడ్డులోకి అతడు చేరుకోగానే పోలీసులకు సమాచారం అందించారు అరుణ్ శర్మ. వెంటనే అలర్టైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.