డ్రింక్ చల్లిన అభిమాని.. ఆవేశంతో మైక్ విసిరి కొట్టిన సింగర్

డ్రింక్ చల్లిన అభిమాని.. ఆవేశంతో  మైక్  విసిరి కొట్టిన సింగర్

అమెరికా రాపర్ సింగర్  కార్డి బి కి ఓ మ్యూజిక్ షోలో ఊహించని ఘటన ఎదురయ్యింది.  స్టేజ్ పై పాట పాడుతుండగా ఓ మహిళా అభిమాని ఆమెపై డ్రింక్ చల్లింది. దీంతో ఒక్కసారిగా షాకైన కార్డి బి  ఆగ్రహాంతో  తన చేతులో ఉన్న మైక్ ను ఆ లేడి ఫ్యాన్ పై విసిరి కొట్టింది. వెంటనే  సెక్యూరిటీ సిబ్బంది స్టేజ్ పై నుంచి దిగి ఆ లేడి ఫ్యాన్ ను అక్కడి నుంచి పంపిచారు. కాసేపటి తర్వాత కార్బి బి తన  మ్యూజిక్ షోను కంటిన్యూ చేశారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు  ఈ ఘటనపై ర్యాపర్ కార్డి బి కి సపోర్ట్ చేస్తున్నారు . సెలబ్రిటీలపై  అలా విసరడం మానుకోవాలని.. అది మంచి పద్దతి కాదని.. వారు కూడా మనుషులేనంటూ కామెంట్ చేస్తున్నారు. డ్రింక్ చల్లిన ఫ్యాన్ ను తిడుతున్నారు. 

 షో చేస్తున్నప్పుడు   కళాకారులపైకి వస్తువులు విసరడం ఇదేం మొదటిసారి కాదు. ఇటీవల సింగర్   హ్యారీ స్టైల్స్ వియన్నాలో షో  చేస్తున్నప్పుడు స్టేజ్ పైకి ఓ వస్తువు విసిరేశాడు. దీంతో అతడి కంటికి గాయం అయ్యింది.  అంతకుముందు, డ్రేక్, బెబే రెక్షా, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌తో సహా ఇతర సెలబ్రిటీలను స్టేజ్ పై  షో చేస్తున్నప్పుడు  వస్తువులతో కొట్టారు.