
హైదరాబాద్, వెలుగు: పండుగలను జనం మరింతగా ఆస్వాదించేలా చేయడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దేశవ్యాప్తంగా భారీ కార్నివల్స్ (ఉత్సవాలు) నిర్వహిస్తామని శ్రేయాస్ మీడియా సంస్థ ప్రకటించింది. ఇటీవల తాము నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ గిన్నిస్ రికార్డు సాధించిందని శ్రేయాస్ మీడియా ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ ద్వారా రూ.1,000 కోట్ల వ్యాపారం జరిగిందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో విజయవాడ ఉత్సవ్ ద్వారా రూ.5,000 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. బిహు, ఓనం, గణేష్ చతుర్థి, పొంగల్, లోహ్రి, దుర్గా పూజ, సంక్రాంతి లాంటి ప్రాంతీయ పండుగల కోసం ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఏడాదంతా 30 భారీ కాన్సర్ట్స్ చేస్తామని, అరకు కాఫీ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని రావు వివరించారు.