ఏం జరిగింది..? : కోహ్లీ పబ్ పై బెంగళూరు పోలీసుల కేసు

ఏం జరిగింది..? : కోహ్లీ పబ్ పై బెంగళూరు పోలీసుల కేసు

విరాట్ కోహ్లీ.. క్రికెట్ హీరో.. ఇటీవల పబ్, రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా బెంగళూరులో పబ్ ఓపెన్ చేశారు. కోహ్లీ బ్రాండ్ పై బెంగళూరు సిటీలో.. అత్యంత ఖరీదైన ఏరియాలో ప్రారంభం అయిన ఈ పబ్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు.. కస్టమర్లు మస్త్ గా వస్తుంటే.. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుండటంతో.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారంట నిర్వాహకులు.. టైమింగ్స్ దాటిన తర్వాత కూడా పబ్ నడుస్తుండటం.. డీజే సౌండ్స్ తో చుట్టుపక్కల వాళ్లు కంప్లయింట్ చేయటంతో.. కోహ్లీ పబ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి సమీపంలో ఉన్న కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ అనే  పబ్ పై స్థానికులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.కర్ణాటక ప్రభుత్వ రూల్స్ ప్రకారం రాత్రి ఒంటిగంట వరకే పబ్ లకు అనుమతి ఉంది. కానీ, కోహ్లీ పబ్ రాత్రి 1:30గంట దాటినా కూడా మూసేయకుండా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజే ప్లే చేస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.

చిన్నపిల్లలు, వృద్దులు ఉన్న ఇళ్లలో ఈ పబ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉందంటూ ఫిర్యాదు చేశారు స్థానికులు.ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోహ్లీకి బెంగళూరులోనే కాకుండా ముంబయి, చెన్నై, పూణే, కోల్కతాలో కూడా బ్రాంచ్ లు ఉన్నాయి.