హనుమకొండ జిల్లాలో మహిళను వివస్త్రను చేసిన  ఘటనలో మరో10 మందిపై కేసు

హనుమకొండ జిల్లాలో మహిళను వివస్త్రను చేసిన  ఘటనలో మరో10 మందిపై కేసు

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్  మండలం తాటికాయల గ్రామంలో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని రిమాండ్​కు తరలించారు. ఆదివారం బాధితురాలి స్టేట్​మెంట్  ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి కొందరు గ్రామ పెద్దలు, ఇతరులు సహకరించినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసి బొల్ల రాజు, చిక్కుడు దేవేందర్, ఎర్ర ప్రభాకర్, దూబల రాజయ్య, మామిడాల వెంకటేశ్వర్లు, పెసరు రాములు, చిక్కుడు సాంబరాజు, చిక్కుడు రాజపోశాలు, ఉస్తం పోశాలు, పెసరు రమేశ్, బత్తిని రాజేశ్ పై కేసు నమోదు చేశారు. వారి నుంచి 3 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ​ప్రవీణ్ కుమార్  తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 25 మందిపై కేసు నమోదు చేసినట్లైంది.