తప్పుడు సమాచారమిచ్చారని కరోనా పేషంట్‌పై కేసు నమోదు

తప్పుడు సమాచారమిచ్చారని కరోనా పేషంట్‌పై కేసు నమోదు

భార్యపైన కూడా చార్జెస్..
తప్పుడు సమాచారం ఇచ్చినందుకే
రూ. 5 లక్షల ఫైన్, 6 నెలల జైలుకు చాన్స్

చైనా నుంచి వచ్చిన ఓ కరోనా పేషెంట్, అతడి భార్య తప్పుడు సమాచారం ఇచ్చారని సింగపూర్ హెల్త్ ఆఫీసర్లు కేసు పెట్టారు. వ్యాధి తగ్గక ముందు ఎక్కడెక్కడ తిరిగొచ్చారన్న దానిపై తప్పుడు సమాచారమిచ్చారని సింగపూర్‌‌‌‌ అధికారులు చార్జెస్ నమోదు చేశారు. వూహాన్‌‌‌‌కు చెందిన హుజున్‌‌‌‌ (38) గత నెల 22న సింగపూర్‌‌‌‌ వచ్చారు. కొవిడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చేయగా పాజిటివ్‌‌‌‌ వచ్చింది. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్నాక వ్యాధి తగ్గడంతో డిశ్చార్జ్‌‌‌‌ అయ్యా రు. అయితే తర్వాత జరిగిన విచారణలో వాళ్లు తీసుకున్న ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌, పర్యటించిన ప్రదేశాల గురించి అబద్ధం చెప్పారని అధికారులు వెల్లడించారు. వైరస్‌‌‌‌ సోకిన వారి కదలికలను గురించి తెసుకుంటే మరింత వ్యాపించకుండా అడ్డుకోగలుగుతామని, వీరు అబద్ధం చెప్పి మోసం చేశారన్నారు. నేరం రుజువైతే వీరికి రూ. 5 లక్షల ఫైన్, 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో ఘటనలో ఓ విదేశీయుడి పర్మనెంట్‌‌‌‌ రెసిడెంట్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ను సింగపూర్‌‌‌‌ ఇమిగ్రేషన్‌‌‌‌ అధికారులు రద్దు చేశారు. చైనా వెళ్లొచ్చిన అతడు కొద్ది రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పినా వినలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, కరోనా వైరస్‌‌‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,800 మంది చనిపోయారు. 81 వేల కేసులు నమోదయ్యాయి. చైనాలో బుధవారం నాటికి వైరస్‌‌‌‌ బారిన పడి చనిపోయిన వాళ్ల సంఖ్య 2,715కు చేరింది. వ్యాధి సోకిన వారి సంఖ్య 78,064కు చేరుకుంది. దక్షిణ కొరియా, ఇరాన్‌‌‌‌, ఇటలీ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశాలకు అత్యవసరమైతేనే వెళ్లాలని మన సిటిజన్లకు కేంద్రం సూచించింది. ఫిబ్రవరి 10 తర్వాత ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్లు రెండు వారాలు ఇంట్లోనే ఉండాలని చెప్పింది.

అమెరికాలో క్లినికల్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ స్టార్ట్‌
‌‌‌ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌‌‌ క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రస్కా మెడికల్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో మొదలయ్యా యి. ప్రపంచవ్యాప్తంగా 50 ప్రాంతాల నుంచి 400 మంది పేషెంట్లను ట్రయల్స్‌‌‌‌కు తీసుకుంటారని తెలిసింది. వీళ్లలో సగం మందికి యాంటీ వైరల్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌ రెమ్‌ డెసివిర్‌‌‌‌, మరో సగం మందికి ప్లాసెబో ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇలాంటి డ్రగ్స్‌‌‌‌తో ట్రయల్స్‌‌‌‌ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మొదలయ్యాయి. కరోనా వైరస్‌‌‌‌ లక్షణాలున్న పేషెంట్లు ఈ ట్రయల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అవొచ్చని వాటిని నిర్వహిస్తున్న వర్సిటీ అధికారులు వెల్లడించారు. కరోనాకు ఇప్పటి వరకు సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ను గాని, వైరస్‌‌‌‌ను గాని కనుగొనలేదు. పేషెంట్లకు రిలీఫ్‌ కోసం ఫ్లుయిడ్స్‌‌‌‌, పెయిన్‌‌‌‌ కిల్లర్స్‌‌‌‌ను డాక్టర్లు సూచిస్తున్నారు.

For More News..

బిల్ కౌంటర్‌లు లేని సూపర్ మార్కెట్

ప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు