జి.పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ మనవడిపై కేసు నమోదు

V6 Velugu Posted on May 14, 2022

  • రాత్రికి రాత్రే గదికి అడ్డంగా గోడకట్టి తాళం వేసి నిర్బంధించి పరారయ్యాడు

పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ జి.పుల్లారెడ్డి మనుమడు ఏక్ నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు. ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గొడవలో భాగంగా ఏక్ నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా రాత్రికే రాత్రే రూంకు అడ్డంగా గోడ కట్టి ఇంటికి తాళం వేసి నిర్బంధించి పారిపోయాడని ప్రగ్యారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రగ్యారెడ్డి ఫిర్యాదుతో ఏక్ నాథ్ రెడ్డిపై వరకట్న వేధింపుల చట్టం, గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

 

 

Tagged Hyderabad, police case, domestic violence, Punjagutta PS, G Pullareddy Sweets, Ek Nath Reddy

Latest Videos

Subscribe Now

More News