
కామారెడ్డి టౌన్,బోధన్, భిక్కనూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నగదు పట్టుకున్నారు. బోధన్ కొత్త బస్టాండ్సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.4 లక్షలు, కామారెడ్డి టౌన్లో రూ. లక్షా పదిహేడు వేలు, భిక్కనూరులో రూ.లక్షా ఎనభై వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.