
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. నిత్యం రాజకీయ శత్రువులుగా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనాస్త్రాలతో ఒకరిపై మరోకరు మాటల దాడి చేసికునే నేతలు కొంచెం సేపు సరదాగా కనిపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న రెండు పార్టీల నేతలు ఇవాళ మధ్యాహ్నం అక్కడి తెలంగాణ భవన్‌లో ఎదురుపడ్డారు. చాయ్ తాగుతూ బీజేపీ నేతలతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరదాగా మాట్లాడుతూ కనిపించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారిని సరదాగా పలకరించారు. బండి సంజయ్‌కు నమస్కరించి.. కొద్దిసేపు మాట్లాడారు. నిత్యం మీడియాలో ఒకరిపై ఒకరు చిటపటలాడే నేతలు ఇలా సరదాగా కనిపించడం విశేషం. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ భారత్‌కు కొత్త రాజ్యాంగం కావాలంటూ చేసిన వ్యాఖ్యలపై, కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ భవన్‌లో ఈ నేతలంతా వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టిన సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
మరిన్ని వార్తల కోసం..
చైనా ఆర్మీ నాకు కరెంట్ షాక్ ఇచ్చింది
ఎయిరిండియా ప్రయాణికులకు రతన్ టాటా వాయిస్‌తో స్పెషల్ మెసేజ్
సైకిల్‌పై పార్లమెంట్‌కు కేంద్ర మంత్రి