దారుణం.. స్టడీస్ పై ఫోకస్ చేయమన్నందుకు కత్తితో పొడిచిండు

దారుణం.. స్టడీస్ పై ఫోకస్ చేయమన్నందుకు కత్తితో పొడిచిండు

అందరూ చూస్తుండగానే ముంబైలో ఓ మైనర్.. తన మాజీ ట్యూషన్ టీచర్ ను కత్తితో పొడిచారు. ఆగస్టు 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతరం టీచర్ ను కత్తితో పొడిచిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదువుపై దృష్టి సారించడం లేదంటూ కొద్దిరోజుల క్రితం అతన్ని.. ఉపాధ్యాయుడు మందలించినట్టు తెలుస్తోంది.

మీరా రోడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోలో యువకుడు.. రాజు ఠాకూర్ (26) అనే టీచర్ పొత్తికడుపుపై ​​కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో టీచర్ కొంతమంది యువకులతో మాట్లాడుతుండగా.. యువకుడు ఆ సమయంలోనే అతని వైపుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం... ఠాకూర్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ మైనర్ ఆగకుండా కత్తిని ఠాకూర్ వీపుపై, పొత్తికడుపుపై పొడుస్తూ ఉన్నాడు. స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నవారు ఆపమని కోరినప్పటికీ, మైనర్ మాత్రం ఠాకూర్‌ను నేలపై పడే వరకు కత్తితో పొడిస్తూనే కనిపించాడు. అనంతరం టీచర్‌ని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే పనిలో ఉండడంతో యువకుడు కత్తిని అక్కడే పడేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

విద్యార్థులకు కోచింగ్ క్లాస్ నిర్వహిస్తున్న ఠాకూర్.. క్లాస్‌లో ఆ విద్యార్థిని కొట్టాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఠాకూర్.. యువకుడిని చదువులపై దృష్టి పెట్టడం లేదని, మహిళా విద్యార్థినులతో సన్నిహితంగా ఉంటాడని తిట్టడంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఠాకూర్ ఒక మహిళా విద్యార్థినిలతో మాట్లాడకూడదని, బదులుగా చదువుపై దృష్టి పెట్టమని కూడా చెప్పాడు. ఇది మైనర్‌కు మరింత కోపం తెప్పించింది. పోలీసులు మైనర్‌పై అభియోగాలు నమోదు చేయలేదు. కానీ దాడికి ఉపయోగించిన కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు.