మీరు ఆదేశిస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తాం: హైకోర్టులో సీబీఐ

మీరు ఆదేశిస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తాం: హైకోర్టులో సీబీఐ

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికల ముందు హైకోర్టులో కాంగ్రెస్ నేత నిరంజన్ పిటిషన్ వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐని ప్రతివాదులు పేర్కొన్నారు పిటిషనర్ నిరంజన్. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు  చేయాలని ప్రభుత్వానికి, సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. 

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది... హైకోర్టుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని తెలిపింది. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని కోరింది. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలతోపాటు సిబ్బంది కావాలని సీబీఐ కోరింది.