
రెండు రోజులుగా టీఆర్ఎస్ దొంగలు, గజదొంగ కేసీఆర్ చెప్పినట్లు పార్లమెంట్ లో ప్రవర్తిస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తే.. రాష్ట్రప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పైగా డీజిల్ ధరలు పెరిగినందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతు ఉత్పత్తుల మీద టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆయన.. 5 సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం 300శాతం వరిధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చెయ్యాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజల సమస్యలు, రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ ఛార్జీల ధరల పెంపుపై పోరాడతామన్నారు. కేసీఆర్ ను 100 శాతం జైలుకు పంపుతామని.. సీబీఐ, ఈడీ త్వరలో కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభిస్తాయన్నారు ఎంపీధర్మపురి అరవింద్.